ETV Bharat / state

అనాథ చిన్నారులకు అండగా గిడ్డంగుల సంస్థ ఛైర్మన్​ - సూర్యాపేట జిల్లా ముకుందాపురంలోని అనాథ చిన్నారులకు గిడ్డంగుల సంస్థ ఛైర్మన్​ ఆర్థిక సాయం

సూర్యాపేట జిల్లా ముకుందాపురం గ్రామంలోని ముగ్గురు చిన్నారులు.. పసివయస్సులో తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని నేనున్నానంటూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేలు ముందుకువచ్చారు. బాలికలకు ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చూపారు. ఉన్నత చదువు కోవాలని ఏమైనా అవసరం అయితే తానున్నానని మరువద్దని వారికి ధైర్యం చెప్పారు.

State Warehousing Corporation Chairman Samelu provides financial assistance to orphans in Suryapet District Mukundapuram
అనాథ చిన్నారులకు తానున్నానంటూ చేరదీసిన గిడ్డంగుల సంస్థ ఛైర్మన్​
author img

By

Published : Aug 8, 2020, 2:10 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ముకుందాపురం గ్రామంలోని మీసాల పరశురాములు-అనితలకు ముగ్గురు ఆడ సంతానం కాగా దంపతులిద్దరు ఇటీవలే చనిపోవడం వల్ల ఆ చిన్నారులు అనాథలయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న సంధ్య(10), నవ్య(7), దివ్య(5)లను మేనమామ రాయప్ప తీసుకుని వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న తనకు మనసెంతో చలించిపోయిందని, వెంటనే వారిని చూడడానికి వచ్చానని తన వంతు సాయంగా రూ.30వేలు డబ్బును అందించానని సామేలు తెలిపారు.

ప్రతి నెల 25 కిలోల బియ్యం అందిస్తానని.. చిన్నారుల చదువులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. తానూ కడు పేదరికంలో జన్మించినప్పటికీ ఏ రోజు ధైర్యం కోల్పోకుండా.. ఎంచుకున్న రంగంలో చిత్తశుద్ధితో పని చేయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని ఆయన తెలిపారు. ఆ చిన్నారులను ప్రేమతో దగ్గర తీసుకొని ధైర్యం కోల్పోవద్దని మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని.. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి, ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండిః ఇరుకు ఇళ్లలోనే ఐసోలేషన్.. బాధితుల్లో మస్తు పరేషాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.