ETV Bharat / state

శంబులింగేశ్వర స్వామి సన్నిధిలో ఉదయగిరి ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు

సూర్యాపేట జిల్లా శంబులింగేశ్వర స్వామి సన్నిధిని ఏపీ నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, సోదరులు చేజర్ల చలమా రెడ్డి దంపతులు దర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

శంబులింగేశ్వర స్వామి సన్నిధిలో ఉదయగిరి ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
శంబులింగేశ్వర స్వామి సన్నిధిలో ఉదయగిరి ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
author img

By

Published : Aug 16, 2020, 6:30 PM IST

సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఏపీ నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, సోదరులు చేజర్ల చలమా రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత పురాతనమైన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం పట్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

రూ.6 లక్షల విరాళం...

ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఆలయాభివృద్ధి కోసం చంద్రశేఖర్ రెడ్డి సోదరులు రూ. 6 లక్షలు విరాళంగా ప్రకటించారు. విరాళాన్ని ఆలయ ముఖ ద్వారానికి వెండి తొడుగులు కోసం వినియోగిస్తామని ఆలయ ఛైర్మన్ భోగాల కొండారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల కార్మికశాఖ అధ్యక్షులు సాముల వెంకట్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'ఉదారవాద ఆలోచన గల మహా నేత వాజ్​పేయీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.