ETV Bharat / state

ఊరికి కూలీ.. ఉత్పత్తులు ఖాళీ.. - Shortage of labors in due to corona

వలస కూలీలు, కార్మికులను సొంతూర్లకు పంపడానికి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయడంతో వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు పరిశ్రమలు, సంస్థల నుంచి దాదాపు 10 వేల మంది స్వస్థలాలకు బయలుదేరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలను నడపడానికి పూర్తిస్థాయిలో అనుమతులు ఇచ్చినప్పటికీ కూలీల కొరతతో పరిశ్రమల ఉత్పత్తులు సగానికి మించడం లేదు.

Shortage of laborers in Nalgonda industries
ఊరికి కూలీ..ఉత్పత్తులు ఖాళీ
author img

By

Published : May 10, 2020, 10:37 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఔషధ పరిశ్రమల ఉత్పత్తులకు భారీ డిమాండ్‌ ఉంది. పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభించాలంటే కూలీల కొరత వేధిస్తోందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు చౌటుప్పల్‌, బీబీనగర్‌, పోచంపల్లి, భువనగిరి, బొమ్మలరామారం, చిట్యాల మండలాల్లోని ఔషధ పరిశ్రమలతో పాటూ జిన్నింగ్‌ మిల్లులు, మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న రైస్‌మిల్లుల్లో హమాలీలుగా పనిచేస్తున్నారు. వీరంతా వారం రోజుల నుంచి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు.

ఒక్క బీబీనగర్‌ నుంచి నాలుగు రోజుల్లో దాదాపు ఆరు వేల మంది వలస కూలీలు వారి ప్రాంతాలకు వెళ్లారు. దీంతో పరిస్థితులన్నీ కుదుటపడ్డాయనుకుంటే కూలీల కొరత ఇబ్బందిగా మారిందని ఔషధ పరిశ్రమలు ప్రభుత్వానికి విన్నవించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అడ్డా కూలీలు కూడా వారి సొంతూర్లలోనే కాలం గడుపుతున్నారు. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ లాంటి పట్టణాల్లో అడ్డాల మీద కూలీలు సగానికి సగం తగ్గిపోయారు.

ప్రత్యామ్నాయంగా వీరితోనైనా పనిచేయించుకుందామన్నా నిరాశే మిగులుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దాదాపు 100కు పైగా ఔషధ కంపెనీలు, మ్యానుఫాక్చరింగ్‌, వస్త్ర, రైస్‌మిల్లులు, జిన్నింగ్‌మిల్లుల్లో దాదాపు 25 వేల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 10 వేల మంది వరకు వారి సొంతూర్లకు వెళ్లారు. వీరిని భర్తీ చేయడం ఇప్పుడు పరిశ్రమలకు సవాలుగా మారింది.

బీబీనగర్‌ మండలంలోని ఓ ఔషధ పరిశ్రమలో లాక్‌డౌన్‌కు ముందు నిత్యం మూడు షిప్టుల్లో దాదాపు 600 మంది కూలీలు పనిచేసేవారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో మార్చి నెలాఖరు నుంచి ఈనెల మొదటి వరకు రెండు షిప్టుల్లోనే పనులు సాగాయి. కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను స్వస్థలాలకు వెళ్లేలా మార్గదర్శకాలు జారీ చేయడంతో ఇప్పుడు పరిశ్రమకు వచ్చే కూలీల సంఖ్య 250కి మించడం లేదు.

పోచంపల్లి మండలంలోని ఓ వస్త్ర పరిశ్రమలోనూ లాక్‌డౌన్‌కు ముందు మూడు షిప్టుల్లో ఉత్పత్తులు సాగగా.. ఇప్పుడు ఒక షిప్టుకే కూలీల కొరత ఏర్పడుతోంది.

ఈ రాష్ట్రాల నుండి వలస కూలీలు

బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌

ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలు

చౌటుప్పల్‌, బీబీనగర్‌, పోచంపల్లి, భువనగిరి, బొమ్మలరామారం, చిట్యాల, మిర్యాలగూడ

అధికంగా ఉన్న పరిశ్రమలు

ఔషధ, వస్త్ర., తయారీ(మ్యానుఫాక్చరింగ్‌) పరిశ్రమలతోపాటు రైస్‌మిల్లులు

ఇప్పట్లో నిర్మాణ రంగం కోలుకునేనా?

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోగా... నల్గొండ జిల్లాలో నమోదైన 15 మంది కరోనా బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రభుత్వం నిర్మాణ పనులకు పలు ఆంక్షలతో అనుమతులిచ్చింది. సూర్యాపేట జిల్లాల్లోనూ పలు సడలింపుల మధ్య నిర్మాణ పనులు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. కూలీల కొరత, అమాంతంగా పెరిగిన ముడి సరకుల ధరలు నిర్మాణరంగాన్ని ఇప్పట్లో కోలుకునిచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 50 కిలోల సిమెంటు బస్తాను ఇప్పటికే వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అదనంగా రూ.100 అమ్ముతున్నారు.

మరోవైపు పూర్తిస్థాయిలో సిమెంటు, స్టీలు దుకాణాలు తమ కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఉమ్మడి జిల్లాలోని సిమెంటు పరిశ్రమల్లోనూ పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలుకాలేదు. మేళ్లచెర్వు, మఠంపల్లి, దామరచర్ల మండలాల్లో ఉన్న పెద్ద కంపెనీలైన సాగర్‌, మై హోం, ఇండియా, జువారి, చెట్టినాడ్‌ తదితర కంపెనీలు ఇప్పటికే 80 శాతానికి పైగా ఉత్పత్తులు మొదలుపెట్టినా చిన్న కంపెనీల్లో ప్రస్తుతం 30 నుంచి 40 శాతం వరకే సిమెంటు ఉత్పత్తి అవుతోంది.

ప్రస్తుతం ఇక్కడ ఉపాధికి కొదువలేదు. ఫార్మా, రైస్‌మిల్లుల్లో ఇప్పటికిప్పుడు దాదాపు 4 నుంచి 5 వేల వరకు కూలీల అవసరం ఉంది. మరో వారం పది రోజుల్లో అన్ని పరిశ్రమలు నూరు శాతం ఉత్పత్తికి చేరుకోనున్నాయి. ఈ పరిస్థితుల్లో మానవ వనరుల కొరత ఆర్థికంగా దెబ్బతీస్తుందని వాపోతున్నారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం (వైటీపీఎస్‌)లోనూ దాదాపు 1500 మంది కూలీలు తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామని ఆందోళన చేయగా.. పోలీసుల జోక్యంతో వారికి రావాల్సిన వేతనాలను యాజమాన్యంతో మాట్లాడి ఇప్పించడంతో పాటు వారు ఇక్కడే ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఆ ప్రాజెక్టు పనులు త్వరలోనే ముమ్మరం కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.