సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వీఆర్ఓలు... దస్తావేజులను తహసీల్దార్ కు అప్పగించారు. వీఆర్ఓల నుంచి అన్ని రకాల రికార్డ్స్ ను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని... అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకొని సీసీఎల్ కు పంపాలని కలెక్టర్లుకు ఇచ్చిన ఆదేశాలలో సీఎస్ స్పష్టంగా పేర్కొన్నారు.
రెవెన్యూ వ్యవస్థపై అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉండటం వల్ల రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగానే సీఎం కేసీఆర్... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.