సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని వీవీఎం స్కూల్ దగ్గర కిరాయికి ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ యాదగిరికి చెందిన ద్విచక్రవాహనం పల్సర్‌ను రాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. పక్కన ఉన్న వాహనాలకు మంటలు అంటుకునే లోపే స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పారు. యాదగిరికి కుటుంబీకులతో ఉన్న పాత తగాదాలు, భూ తగాదాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'