సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని వలస కూలీలకు బియ్యం పంపిణీ చేశారు. బిహార్ నుంచి వచ్చి రైస్ మిల్లు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, రూ. 500లు తహసీల్దార్ జయశ్రీ అందించారు. కరోనా వ్యాప్తి, నివారణపై వారికి అవగాహన కల్పించారు. అందరూ మాస్కులు దరిస్తూ, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దేశంలో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి