సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలో వార్డు మెంబర్‌గా, రేషన్ డీలర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా... సాధారణ జ్వరమేనని వైద్యులు మందులు ఇచ్చి పంపారు.
కొన్ని రోజుల క్రితం పొరుగు దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి కరచాలనం చేశానని... అందుకే జ్వరం వచ్చిందని అందరికి దూరంగా ఉంటూ స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు.
తనకూ కరోనా వచ్చిందేమో అనే భయంతో నిన్న రాత్రి వ్యవసాయ బావి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: బాధ్యతగా ఉండకపోతే... తప్పదు భారీ మూల్యం