ETV Bharat / state

ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నిరసన

తిరుమలగిరిలో పలువురు బాధితులు తమ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఆ సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుమలగిరి తహసీల్దార్ హరిచంద్రప్రసాద్​​ ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే చర్యలు తప్పవని అన్నారు.

Protest to give rails to house at tirumalagiri suryapet
ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నిరసన
author img

By

Published : Feb 8, 2020, 1:17 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తమ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాస్, ఆర్​ఐ ప్రసన్న, వీఆర్​వో సోమయ్యలతో కలిసి తిరుమలగిరిలోని 429 భూమిని సర్వే చేశారు. ఆ సర్వే నెంబర్​లో 11 ఎకరాల 37 గుంటలకు లావని పట్టా అందజేశామని, 38 గుంటలు ఇళ్ల స్థలాలుగా రెవెన్యూ రికార్డులో నమోదైందని, మిగిలిన 12 ఎకరాల 35 గుంటల భూమి రెవిన్యూ రికార్డులో ఉందని తహసీల్దార్ హరిచంద్రప్రసాద్​​ వివరించారు.

అన్యాక్రాంతమైన భూమిని వెలికితీసేందుకు పలువురికి ఈనెల 3న నోటీసులు జారీ చేశామన్నారు. అందులో 23 మంది నోటీసులు పొందినవారు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని తహసీల్దార్ తెలిపారు. వారి అనుమతుల మేరకు డివిజన్ సర్వే అధికారితో సర్వేచేసి నివేదికను అందజేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నిరసన

ఇదీ చూడండి : బాబోయ్.. ఒంటిపై ఐదు కేజీల బంగారం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.