కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాల నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ రైతులు ఉద్యమించాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నిర్దేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏఐకేఎంఎస్, న్యూ డెమోక్రసీ నిర్వహించిన రైతు పోరు గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. స్థానిక పాత మార్కెట్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారుల భేరీ వాయిద్యాలు, కోలాట ప్రదర్శన నిర్వహించారు.
"వ్యవసాయ రంగంలో కార్పొరేట్ కంపెనీలను అనుమతించడం వల్ల దోపిడీ మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో తెరాస పెద్దల అండతో భూదందాలు పెరుగుతున్నాయి. మాట వినని వారిపై దాడులు జరుపుతున్నారు. హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల ఘటన చూస్తుంటే.. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిని హత్య చేస్తారన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ దుష్ట విధానాలను తిప్పి కొట్టేందుకు ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకం చేసే చర్యలు కొనసాగుతున్నాయి."
-ప్రొఫెసర్ కోదండరాం, తెజస అధ్యక్షుడు
కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేవీ చలపతిరావు, ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దేశమంతటా 'రథసప్తమి' పర్వదిన శోభ