సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండల కేంద్రంలో పైప్లైన్ లీక్ కావడంతో రహదారిపై నీరు వృథాగా పోతోంది. గతంలో కూడా ఇలాగే జరిగిందని స్థానికులు తెలిపారు. రహదారిపై నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి కట్టడికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: పంటకు నిప్పుపెట్టిన రైతు