యాదవుల ఇలవేల్పు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఈ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. సూర్యాపేట పురపాలక సంఘంలో అంతర్భాగంగా ఉన్న దురాజ్ పల్లి గుట్టపై నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. ఈ ప్రాంతానికి శివుడు రావడంతోనే పెద్దగట్టు జాతర ప్రారంభమైందని ప్రతీతి.
కోటి 70లక్షల నిధులు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రూ. కోటి 70 లక్షల నిధులు మంజూరు చేసింది.
పెద్దగట్టుకు భారీ భద్రత
సూర్యాపేట ఎస్పీ ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే మార్గంలో తొలి రెండు రోజుల పాటు జాతీయ రహదారిని స్తంభింపజేయనున్నారు. జాతరకు పెద్దఎత్తున జనం తరలిరానుండటంతో మిషన్ భగీరథ ద్వారా నీరందించే ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి :ప్రభుత్వం పని కోర్టు చేసింది