సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాకు చెందిన గిరిజన విద్యార్థిని మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయం జరిగే వరకు కోటేశ్వరి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ప్రమాదావశాత్తు విద్యుత్ తీగ తగిలి ఎద్దు మృతి