ETV Bharat / state

కిట్ల కొరత పేరుతో తిప్పిపంపడం దారుణం: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - పీసీసీ ఛీప్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి వార్తలు

కరోనా పరీక్షలు తగ్గించడం దురదృష్టకరమని నల్గొండ ఎంపీ, పీసీసీ ఛీప్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. కొవిడ్​ వార్డులో ఉన్న బాధితులను పరామర్శించారు.

mp, pcc chief
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : May 24, 2021, 7:17 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని నల్గొండ ఎంపీ, పీసీసీ ఛీప్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సందర్శించారు. కొవిడ్​ వార్డులో ఉన్న బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు ఆడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లాలో కరోనా విజృంభిస్తున్న వేళ జనరల్ ఆస్పత్రిలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవల అందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. త్వరలోనే 300 పడకల నుంచి 950 పడకల పీజీ ఆస్పత్రిగా మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్యను తగ్గించిందని.. వచ్చిన బాధితుల్లో 20 శాతం మందికే పరీక్షలు చేసి మిగతావారిని కిట్ల కొరత పేరుతో తిప్పిపంపడం బాధాకరమని అన్నారు. తక్షణమే వంద శాతం బాధితులకు పరీక్షలు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాపిడ్ టెస్టుల స్థానంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడమే శ్రేయస్కరమని అన్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్నారు.

హుజూర్​నగర్ ఆస్పత్రిలో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ లైన్స్, వెంటిలేటర్ సదుపాయాలతో ఐసీయూ కేంద్రంతో పాటు సీటీ స్కాన్ ఏర్పాటు చేయాలన్నారు. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: కరోనా, లాక్‌డౌన్ సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.