ఉత్సాహంగా తెరాస శ్రేణులు...
సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లకు దగ్గరయ్యేందుకు తెరాస ప్రయత్నిస్తోంది. బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న హుజూర్‌నగర్‌లో.... ఆయా కులసంఘాల పెద్దలతో నేతలు మంతనాలు జరిపారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్న తీరును వివరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటించటం వల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.
ప్రతిపక్షాల ప్రచార వ్యూహాలు...
కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి విస్తృతంగా పర్యటిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి నాయకులు... పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీకి విధేయంగా ఉండేవారినే ఏరికోరి మండలాల్లో వేశారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ రెండు మూడు సార్లు... నియోజకవర్గానికి వచ్చి వెళ్లారు. బంధువర్గం అత్యధికంగా ఉన్న గరిడేపల్లి, నేరేడుచర్ల వంటి మండలాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నేటి నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు.
మిగతా పార్టీలు సైతం సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. బీసీకి టికెటిచ్చిన భాజపా... పార్టీ అభ్యర్థి రామారావు తరఫున ప్రచారం చేసేందుకు అగ్ర నేతల్ని దింపాలని యోచిస్తోంది. తెదేపా తరఫున రాష్ట్ర అధ్యక్షుడు రమణ నియోజకవర్గానికి వచ్చివెళ్లగా... అభ్యర్థి కిరణ్మయి అనుచరగణంతో ఊరూరా తిరుగుతున్నారు. కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన తెజస... ఆ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై పంతాలకు పోకుండా నిర్ణయం తీసుకోండి'