సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పోలీసు స్టేషన్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా... అందులోని నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల్ బురాంపురం గ్రామానికి చెందిన చిలువేరు శాంతకుమార్, జంపాల ప్రవీణ్ కపిల్, సాయి కుమార్, తాటికొండ కపిల్గా పోలీసులు గుర్తించారు. నిమ్మకల్ దండు మైసమ్మ టెంపుల్ వద్ద ఓ వివాహావేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. హైవే 365 నుంచి వరంగల్ రోడ్డుకు దిగే క్రమంలో షిఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: అటవీశాఖ అధికారుల వాహనాన్ని వెంబడించిన గజరాజు