ETV Bharat / state

Old couple request for pension : ఆధార్ లేదని నిరాదరణ.. సాయం కోసం వృద్ధుల నిరీక్షణ - ఆసరా పింఛన్ సమస్యలు

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. రేయింబవళ్లు కాయకష్టం చేసుకుంటూ బతుకీడుస్తున్న ఆ దంపతులకు.. చేతికందొచ్చిన కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం తీరని విషాదాన్ని మిగిల్చింది. కొడుకు మరణంతో కాలం వెల్లదీస్తున్న ఆ భార్యాభర్తలకు వృద్ధాప్యం భారమవుతోంది. 96 ఏళ్లు వచ్చిన ఆ వృద్ధుడికి కళ్లు కనిపించవు. భార్య సాయంతో ఈత బుట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. కళ్లు కనిపించకపోవడం వల్ల ఐరిస్ గుర్తించక ఆధార్ కార్డు మంజూరు కాలేదు. ఆధార్ లేకపోవడం వల్ల పింఛను(Old couple request for pension) రావడం లేదు. తన భార్యకు అర్హత ఉన్నా ఆమెకు ఇవ్వడం లేదు. రేషన్ బియ్యంతో.. ఈత బుట్టలు అమ్మితే వచ్చే కాస్త డబ్బుతో కాలం గడుపుతున్నారు. చనిపోయేవరకు ఎవరి ముందు చేయిచాచకుండా ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఆశని చెబుతున్నారు.

Old couple request for pension
Old couple request for pension
author img

By

Published : Oct 10, 2021, 8:50 AM IST

పై చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుని వయస్సు 96 ఏళ్లు. రెండు కళ్లూ కనబడవు. చేతికందివచ్చిన కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. భార్యతో కలిసి పూరి గుడిసెలో నివాసం ఉంటూ.. ఈత బుట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అన్ని అర్హతలున్నా.. రెండేళ్ల నుంచి పింఛన్‌(Old couple request for pension) సొమ్ము అందక ఇబ్బందులు పడుతున్నారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం వెంకేపల్లికి చెందిన పాపయ్యకు 1990 నుంచి పింఛను వచ్చేది. కళ్లు కనిపించని కారణంగా ఐరిస్‌ గుర్తించకపోవడం, చేతివేళ్ల గుర్తులు చెరిగిపోవడంతో ఆయనకు ఆధార్‌ కార్డు మంజూరుకాలేదు. ఆధార్‌ అనుసంధానం కాలేదంటూ.. రెండేళ్ల నుంచి అధికారులు పింఛన్‌(Old couple request for pension) నిలిపేశారు. ఆధార్‌ కార్డు ఉన్నా భార్య రామనర్సమ్మకూ ఇవ్వడం లేదు. ఆమెకు మాత్రమే రేషన్‌ బియ్యం వస్తోంది. ఈత బుట్టలు అమ్మితే వచ్చేది కొంచెెం డబ్బే. తిండి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. అకస్మాత్తుగా ఏదైనా జబ్బు చేస్తే ఆస్పత్రి ఖర్చులకు రూపాయి లేదు.

ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ ఆ జంట తమ కష్టం మీదే బతుకుతోంది. చనిపోయేవరకు ఎవరి ముందు చేయి చాచకుండా ఆత్మగౌరవంతో బతకాలని ఆశపడుతోంది. కానీ కాలే కడుపు ఆ ఆశను అడియాశ చేసేలా చేస్తోందని బాధపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు రావాల్సిన పింఛను(Old couple request for pension) ఇప్పించాలని కోరుతోంది ఆ వృద్ధ జంట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.