ETV Bharat / state

మూడు రోజుల నుంచి కేసుల్లేవ్... కొనసాగుతోన్న నిఘా - corona updates in suryapet

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు... సూర్యాపేట జిల్లా అధికారులు లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద... ఇనుప కంచె వేసి కాపుగాస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఆరు రోజుల నుంచి... సూర్యాపేట జిల్లాలో 3రోజుల నుంచి కేసులు నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తున్నా... రెడ్​జోన్లపై నిఘా కొనసాగుతోంది.

No cases since three days
మూడు రోజుల నుంచి కేసుల్లేవ్... కొనసాగుతోన్న నిఘా
author img

By

Published : Apr 26, 2020, 12:29 PM IST

వారం రోజుల్లో 60 కేసులతో హడలెత్తిన సూర్యాపేట జిల్లా... మూడు రోజుల నుంచి కోలుకుంటోంది. రెడ్​జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్ల... జన సంచారం పూర్తిగా నిలిచిపోయింది. బారికేడ్ల వల్ల రాకపోకలకు అడ్డుకట్ట పడటం లేదన్న కారణంగా వాటి చుట్టూ ఇనుప కంచెలు వేయడం వల్ల సూర్యాపేట పురపాలికతో పాటు ప్రభావిత పల్లెల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

అధికారుల పర్యవేక్షణ..

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ప్రత్యేకాధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఎస్పీ భాస్కరన్... జిల్లా కేంద్రంలోని పలు వీధులను పరిశీలించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే జన సంచారాన్ని నిలువరించాలన్న ధ్యేయంతో... పట్టణాన్ని దిగ్బంధనం చేశారు. ప్రభుత్వ క్వారంటైన్లలో ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ... 16కు చేరింది. హోం క్వారంటైన్లు విధించిన వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగి... 4 వేల 551కి చేరుకుంది. అనుమానితులుగా ఇప్పటివరకు మొత్తం 747 మంది నమూనాలు పంపగా... అందరి ఫలితాలు అందాయి. అందులో 83 మందికి పాజిటివ్ రాగా... సూర్యాపేటలో 54, ఆత్మకూరు (ఎస్) మండలంలో 15, తిరుమలగిరిలో 7, నాగారం మండలంలో 6, నేరేడుచర్లలో ఒక కేసు నమోదయ్యాయి.

ఇంటింటి సర్వే..

సూర్యాపేటలోని మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో... 20 బృందాల ద్వారా అన్ని కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటి సర్వే నిర్వహించారు. 865 ఆవాసాల్లో 2 వేల 681 మంది వివరాలు ఆరా తీశారు. పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ, పోలీసు విభాగాలకు... ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 కిలోల చొప్పున బత్తాయిల్ని కలెక్టర్ పంపిణీ చేశారు.

కాస్త ఊరట..

తిరుమలగిరి మండల కేంద్రంలోని రెడ్ జోన్ల పరిధిలో... రెండ్రోజులకో ఒకసారి సంచార కూరగాయల బజార్లను అనుమతిస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తుండగా... మద్దిరాల, నాగారం, ఆత్మకూరు, మఠంపల్లి మండలాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో లాక్​డౌన్​ను అమలు చేస్తున్నా... వారం నుంచి కేసులు నమోదవకపోవడం ఊరట కలిగిస్తోంది.

ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.