రాష్ట్రంలో సన్నారకం వడ్లకు క్వింటాకు బోనస్‌తో కలిపి రూ.2500 ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. పత్తి పంటకు రూ.5800 ధర ప్రకటించాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల సర్వసభ్య సమావేశానికి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. మండలంలోని పలు సమస్యలపై సమావేశం సాఫీగా సాగింది. మిషన్ మిషన్ భగీరథ కారణంగా రోడ్లు ధ్వంసం, అకాల వర్షానికి వరి పంట నష్టం, చెరువుల మరమ్మతులకు సంబంధించిన సమస్యలను సమావేశంలో చర్చించారు.
వెంటనే ఐకేపీ కేంద్రాలను ఏర్పాటుచేసి సన్నాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ఉత్తమ్ సూచించారు. ఏకకాలంలో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య తెలిపారు. మునగాల మండలానికి ప్రత్యేక నిధులతో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం మునగాల మండలం సమస్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.