సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామంలో గత మూడేళ్ల నుంచి 'సంపూర్ణ ఫౌండేషన్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించి వరంగల్ మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్వాహకులు మీసాల వెంకన్న, మీసాల కృష్ణకు 'మదర్ థెరిసా నేషనల్ అవార్డు'ను అందించారు. సంపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో వేసవికాలంలో చలివేంద్రం, పేదవారికి చీరలు, అనాథ పిల్లలకు పండ్లు, కావలసిన వారికి పుస్తకాలు, లాక్డౌన్ సమయంలో కొంత మంది పేదలకు కూరగాయలు, మాస్కులు, శానిటైజర్స్ పంచిపెట్టారు.
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు అమ్మాయిలకు సంపూర్ణ ఫౌండేషన్ తరపున 50వేల చొప్పున వారి పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. దాతల సహకారంతో 8లక్షల రూపాయలు సేకరించి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. గ్రామంలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గుర్తించిన వరంగల్ మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు యువకులకు 'మదర్ థెరిసా నేషనల్ అవార్డు'ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఈసంపల్లి వేణు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉద్రిక్తత.. ముగ్గురి ఆత్మహత్యాయత్నం