సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో 17, 23 వార్డులో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. పురపాలక సంఘాన్ని అన్ని హంగులతో అద్భుత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న నూతన పంట మార్పిడి విధానానికి రైతులందరూ బాసటగా నిలవాలని కోరారు.
నిజంగా ప్రతిపక్షాలకు రైతులపై ప్రేమే ఉంటే గతంలో వారు పాలించిన సమయంలో రైతులకు ఎందుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.