సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని 25 వ వార్డు కౌన్సిలర్ అస్మా నసీర్ ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు. హిందూ ముస్లింలంతా సోదర భావాన్ని కల్గి ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా కారణంగా ముస్లింలందరూ రంజాన్ పండుగను ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అర్చన రవి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, రహీం, జిలాని, శీను రాము, సైదా తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?