సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రోగులకు మేమున్నామనే భరోసా ఇవ్వాలన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోందని.. వారి పట్ల బాధ్యతాయుతంగా పని చేయాలని కోరారు.
ఆస్పత్రిలో వైద్యుల, సిబ్బంది కొరత ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు మంజూరు అవుతాయని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రికి ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని.. అందుకోసం అందరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ మున్సిపల్ ఛైర్పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ గుడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సీజ్ చేసిన నగదును లాక్కెళ్లడం చాలా పెద్దనేరం: సీపీ జోయల్ డేవిస్