సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. మే నెల అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందని గుర్తు చేశారు. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని... అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
విధిగా మాస్కు ధరించడంతో పాటు చేతులను శుభ్రపరుచుకోవాలని అన్నారు. ప్రజలంతా పెళ్లిళ్లకు, విందులకు దూరంగా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై ఇవాళ సర్కారు కీలక నిర్ణయం!