రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ఈసారి అధిక పంట పండిందని.. పండిన ప్రతి గింజను రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ధాన్యాన్ని తీసుకొచ్చి దళారులకు అప్పజెప్పి మోసపోవద్దని సూచించారు.
ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్ చేస్తూ వ్యాజ్యం