పేదల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తెరాస ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. పారదర్శకంగా పని చేస్తూ.. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, మున్సిపల్ ఛైర్ పర్సన్ రజని, వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ సంతోషిణి, ఎంపీడీవో కె.ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెరాస ప్రభుత్వం రైతు సర్కార్: అలంపూర్ ఎమ్మెల్యే