ETV Bharat / state

Etela Rajender in Suryapet: ఉద్యోగులను మనోవేదనకు గురి చేయవద్దు: ఈటల - తెలంగాణ వార్తలు

Etela Rajender in Suryapet : బదిలీల ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని కోరారు. స్థానికత ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరగాలని సూచించారు.

Etela Rajender in Suryapet, etela about transfers
ఉద్యోగులను మనోవేదనకు గురి చేయవద్దు: ఈటల
author img

By

Published : Dec 28, 2021, 4:17 PM IST

Etela Rajender in Suryapet : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలను ఉద్యోగులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని భాజపా నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం స్థానికత ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరగాలని ఆదేశాలున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా పనిచేసిన ఉద్యోగులను మనోవేదనకు గురి చేయొద్దని కోరారు.

సూర్యాపేట జిల్లాకేంద్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ ప్రాంత రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుశిక్షణా తరగతులకు ముఖ్యఅతిధిగా హాజరైన ఈటల... ఎటువంటి శాస్త్రీయత , పారదర్శకత లేకుండా ఉద్యోగుల బదిలీలను చేపట్టారని విమర్శించారు. ఫామ్​హౌస్​కే పరిమితమైన సీఎం కేసీఆర్... చర్చలు జరపకుండా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. జీవో 317తో టీచర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అన్నారు.

ఉద్యోగుల జీవితాల్లో కునుకు లేకుండా చేశారు. అనేక రకాల చిక్కుముడులు, అపోహలు, అనుమానాలకు తావిచ్చారు. నేనే రాజును. నాకే అన్ని తెలుసు. ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు. నేను చెప్పిందే చేయాలనే హుకూం జారీ చేశారు. ఉద్యోగులను ఎందుకు భయాందోళనలకు గురి చేస్తున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సీనియారిటీలో పాదర్శకత లేదు. స్థానికత దేవుడెరుగు. ఎక్కడా కూడా అక్రమాలు జరగకుండా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని... దాని ప్రకారం నడవాలని కోరుతున్నాం.

-ఈటల రాజేందర్, ఎమ్మెల్యే

ఉద్యోగులను మనోవేదనకు గురి చేయవద్దు: ఈటల

ఇదీ చదవండి: Telangana BJP Focus on SC Voters : మిషన్-19తో ముందుకెళ్లి.. విజయం సాధించాలి: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.