ETV Bharat / state

'రైతులను రాజును చేయటమే ప్రభుత్వ లక్ష్యం' - అనంతగిరి వార్తలు

సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ పర్యటించారు. పలు గ్రామాల్లో రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు వేదికలు దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే తెలిపారు.

mla bollam mallaiah yadhav visited in kodhada

author img

By

Published : Jul 23, 2020, 10:47 PM IST

రైతులను రాజు చేయాలనే లక్ష్యంగా రైతు వేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే... పలు గ్రామాల్లో రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు వేదికలు దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే తెలిపారు. రైతులంతా కలసి పంటల సాగులో నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వేదికలు ఉపయోగపడతాయని వివరించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా... పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అనంతగిరి మండల నూతన పశు వైద్యశాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.