ETV Bharat / state

పిల్లలమర్రి శైవక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి - సూర్యాపేట జిల్లా వార్తలు

మహా శివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చారిత్రక పిల్లలమర్రి శైవక్షేత్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి స్వాగతం పలికి.. శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి వేడుకున్నారు.

Minister Jagadish Reddy visited Pillalamarri Shaiva Temple in suryapeta district
పిల్లలమర్రి శైవక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి
author img

By

Published : Mar 11, 2021, 7:12 PM IST

రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చారిత్రక పిల్లలమర్రి శైవక్షేత్రాన్ని మంత్రి దర్శించుకున్నారు. స్థానిక ఎరుకేశ్వర, నామేశ్వర ఆలయాల్లో పూజలు జరిపారు.

అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం మంత్రిని శాలువాతో సత్కరించారు. ప్రజలు భక్తిభావంతో, తోటి వారి పట్ల ప్రేమానురాగాలతో కలిసి మెలిసి జీవించాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ వట్టే జానయ్య యాదవ్, పురపాలిక ఛైర్ పర్సన్ అన్నపూర్ణ, సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి పాల్గొన్నారు. మంత్రితో కలిసి పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి: భ్రమరాంబికా మల్లికార్జున స్వామి సేవలో హైదరాబాద్ మేయర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.