ETV Bharat / state

'కేసీఆర్​ వల్లే కరెంటు, సాగునీటి కష్టాలు తీరినయ్' - నాగారంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్​రెడ్డి శంకుస్థాపన చేశారు. కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యాక రైతులు కరెంటు కోసం ఎదురుచూసే దుస్థితి ఎప్పుడూ రాలేదని మంత్రి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో బీడు భూములు పంట భూములుగా మారాయని పేర్కొన్నారు.

minister
'కేసీఆర్​ వల్లే కరెంటు, సాగునీటి కష్టాలు తీరినయ్'
author img

By

Published : Dec 24, 2020, 7:28 PM IST

రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. నాగారం శివారులో సబ్​స్టేషన్, రెండు అంగన్వాడీ సెంటర్ల భవనాలు, రూ. 39 లక్షల వ్యయంతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కరెంటు కష్టాలు అనుభవించా..

ఉమ్మడి పాలనలో తెలంగాణలో కరెంటు పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేదని జగదీశ్​రెడ్డి అన్నారు. రైతన్నగా పొలం గట్టుపై కూర్చొని కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్​ సీఎం అయ్యాక మళ్లీ అలాంటి పరిస్థితి ఏ రైతుకు తలెత్తలేదని చెప్పారు.

పుష్కలంగా సాగు నీరు

సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు పుష్కలమైన నీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అందుకే బీడు తెలంగాణ 'పంట తెలంగాణ'గా మారిందని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం కాళేశ్వరం, గోదావరి జలాలతో సస్యశ్యామలమైందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ గుజ్జ దీపిక, తెలంగాణ ట్రాన్స్​కో ఛైర్మన్​ ఎండీ ప్రభాకరరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.