ETV Bharat / state

సూర్యాపేట జిల్లాలో కఠినంగా లాక్​డౌన్​ - telangana lockdown

సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తున్న వేళ అధికారులు లాక్​ డౌన్​ను మరింత కఠినతరం చేశారు. ఆత్మకూరు మండలం ఏపూరు, నాగారం మండలం వర్ధమానుకోట, నేరేడుచర్ల మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో ఆయా గ్రామాలల్లో ప్రతిరోజు హైడ్రోక్లోరైట్​ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు.

lock down in suryapeta district
సూర్యాపేట జిల్లాలో కఠినంగా లాక్​డౌన్​
author img

By

Published : Apr 19, 2020, 5:34 PM IST

కరోనా సోకిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు, నాగారం మండలం వర్ధమానుకోట, నేరేడుచర్ల మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో ఆయా గ్రామాలల్లో ప్రతిరోజు హైడ్రోక్లోరైట్​ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో 44 కేసులు నమోదయ్యాయి. ఆయా పాజిటివ్ కేసుల కాంటాక్టులను పూర్తిగా గుర్తించిన అధికారులు ఇప్పటికే వారందరినీ క్వారంటైన్​కు తరలించారు. జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ అమలు తీరును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు.

రెడ్​జోన్ ప్రాంతంలో ఇంటింటి సర్వే వివరాలను తెలుసుకున్నారు. ముస్లిం సోదరులు వచ్చే రంజాన్ మాసంలో ఇంటివద్దనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 673 రక్త నమూనాలను సేకరించగా 173 మంది ఫలితాలు వచ్చాయి.

ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.