ETV Bharat / state

కోదాడ డంపింగ్ యార్డుతో గ్రామస్థుల ఆందోళన.. పట్టించుకోని అధికారులు - కోదాడ డంపింగ్ యార్డు వల్ల కలుషితమవుతున్న నీరు

Kodada Dumping Yard: కోదాడ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో.. సేంద్రియ ఎరువుగా తయారు చేయాల్సిన చెత్త నిత్యం మంటల్లో కాలుతుంది. డంపింగ్ యార్డు నిరంతరం పొగతోనే కమ్మేయడంతో పక్క గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు సేకరించిన చెత్తను కాల్చవద్దని ప్రభుత్వాలు చెబుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తునట్లు వ్యవహరిస్తున్నారు. ఏళ్లుగా వెంటాడుతున్న సమస్యను పరిష్కరించే వారి కోసం డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు వేచి చూస్తున్నారు. డంపింగ్ యార్డ్ కారణంగా ఇబ్బంది పడుతున్న గ్రామస్థులపై ప్రత్యేక కథనం.

kodad
kodad
author img

By

Published : Jan 26, 2023, 3:06 PM IST

Updated : Jan 27, 2023, 7:08 AM IST

కోదాడ డంపింగ్‌ యార్డుతో గ్రామస్థుల ఆందోళన

Garbage Burning At Kodada Dumping Yard: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో నిత్యం పారిశుద్ధ్య కార్మికులు సేకరించే చెత్తను అనంతగిరి మండలం వెంకటరాంపురం గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న గుట్టపై డంప్ చేస్తారు. పేరుకు సేంద్రియ ఎరువుల కేంద్రం కానీ, తడి పొడి చెత్తను వేరు చేసే సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. నిత్యం మంటల్లో చెత్తను కాల్చడంతో పొగ పక్కనే ఉన్న వెంకట్రామపురం, గోల్ తాండ, వాయిలసింగరం, రామిరెడ్డిపాలెం గ్రామాల ప్రజలు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో శ్వాసకోశ, చర్మ సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థులు ఏళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటీవల సమస్య తీవ్రతరం కావడంతో వెంకట్రామపురం గ్రామస్థులు పెద్ద సంఖ్యలో నిరసన తెలియజేశారు. దీంతో కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ హేమంత్ పాటిల్‌తో డంపింగ్ యార్డ్​ను సందర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు కానీ.. సమస్య పరిష్కారం కావడంలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. చెత్త నుంచి వచ్చే దుర్వాసన కారణంగా గ్రామంలో ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని.. దాంతో జబ్బుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Villages Polluted By Kodada Dumping Yard: కోదాడ పురపాలికలో నిత్యం 45టన్నులకు పైగా చెత్త డంపింగ్ యార్డుకి వస్తుంది. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేసి విక్రయిస్తే ఆదాయం కూడా వస్తుంది. దీని మూలాన చెత్తను కాల్చే అవకాశం తప్పుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో అటు ఆదాయం కోల్పోవడంతో పాటు, ఇటు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

"డంపింగ్ యార్డు ఇక్కడకు తరలించిన దగ్గర నుంచి ప్రక్కన ఉన్న రైతులు, కూలీలు ఇటువైపు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చెత్తాచెదారం కాల్చడం వల్ల ఊరు మొత్తం పొగ కమ్ముకుంటుంది. దీనితో చుట్టూ ప్రక్క గ్రామాలు అన్నీ రాత్రి అయితే చాలు దుర్వాసనతో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. పిల్లలు అనేక రోగాల పాలవుతున్నారు. పిచ్చికుక్కలు ఊళ్లోకి వస్తున్నాయి. ప్రజలు అందరూ బిక్కుబిక్కుమని బతుకుతున్నారు." - కృష్ణ, వెంకట్రామపురం గ్రామస్థుడు

"గత పది సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డుకు సంబంధించిన స్థలాన్ని కోదాడ మున్సిపాలిటీలో 6 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి అక్రమార్కులు దోచుకున్నారు. ఇప్పుడు మా గ్రామంలో ఈ డంపింగ్​ యార్డు ఏర్పాటు చేశారు. కంపోస్టు ఎరువు తయారీ అని బోర్డు పెట్టి.. ఇందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు చెత్తను కాల్చుతున్నారు. దీనివల్ల గాలి, నీరు అన్నీ కలుషితం అవుతున్నాయి." - సూదులు రాములు, గ్రామస్థుడు

ఇవీ చదవండి:

Last Updated : Jan 27, 2023, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.