సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ రక్తదానం చేశారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు రక్తదానం చేసినట్లు తెలిపారు.
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గినందున పార్టీ కార్యకర్తలంతా రక్తదానం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.