Jagadish Reddy fire on BJP leaders: భాజపా నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భాజపా నేతల తీరుపై త్రీవంగా మండిపడ్డారు. కావాలనే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని భాజపా నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా అని... ఆయన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక భాజపా నేతల కుట్ర ఉందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, రాజకీయ లబ్ది పొందటమే భాజపా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఏ దర్యాప్తు సంస్థ చెప్పిందని లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఏ దర్యాప్తు సంస్థ మాపార్టీ నాయకుల పేర్లు గాని, కవిత పేరు గాని ఎక్కడ ప్రస్తవించలేదు. కాని ఎవరో ఒక ఎంపీ ఆరోపణ చేయడం, మా ఇళ్లపై దాడులు చేయడం కావాలనే తెరాస కార్యకర్తలను రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం దాని ద్వారా తెలంగాణ అభివృద్ధిని ఆటంకపరచడం భాజపా నేతల పని. ఇంకో వైపు వారి శాసన సభ్యులతో వాట్సప్, సామాజిక మాధ్యమాల ద్వార ఒక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టడం, దాని వలన ప్రజల మధ్య వైరం పెంచాలి. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఆపాలని భాజపా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. ఈ రోజు రాజాసింగ్ సస్పెన్షన్ డ్రామా... పథకం ప్రకారం మాట్లడించింది వారే, ఆయన్ను సస్పెన్షన్ చేయించింది వారే, ఇంత కన్నా దుర్మర్గంగా ముందు ముందు ప్రవర్తిస్తారు. అందువలన తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. -జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: