తెరాస పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. వారి మాటలు దేశంలో, రాష్ట్రంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని తెరాస కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఓర్వలేక..
"ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేస్తున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని మరచిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచమంతా ఓ అద్భుత ప్రాజక్ట్ అంటూ అభినందిస్తూ ఉంటే, అది చూసి ఓర్వలేక ఆయన అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
చెరువులన్నీ నిండుకుండలా మారాయి. గత చరిత్రలో ఎక్కడా లేని విధంగా చెరువులు, కుంటలు అన్నీ జలకళను సంతరించుకున్నాయి. బంగారు తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారు. 'రైతు బాగుంటే దేశం బాగుంటుంది.. గ్రామం బాగుంటుంది' అనే సంకల్పంతో 24 గంటలు ఉచిత కరెంటుని అందిస్తున్నారు. జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకోవడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని అనుకోవాలి. టీపీసీసీ పదవి కోసం తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదు."
-శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: రసాభాసగా మారిన నగరపాలిక సర్వసభ్య సమావేశం