ETV Bharat / state

'వ్యాపారం చేయాలనుకునే యువతకు రుణసాయం' - mla saidi reddy in matampally

ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. వ్యాపారం చేసుకోవడానికి యువత ముందుకొస్తే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

mla saidi reddy visited matampally mandal
మఠంపల్లి మండలంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పర్యటన
author img

By

Published : Jun 6, 2020, 3:10 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డంపింగ్​ యార్డ్​ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని సైదిరెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు పాలుపంచుకోవాలని కోరారు. రైతు వేదికల్లో అన్నదాతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేసేవిధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకొచ్చే యువతకు రుణాలు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే సైదిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ పార్వతి నాయక్ పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.