సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట పొలాలు వేసి సాగు చేసినట్లయితే రైతులకు అధిక దిగుబడి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడతారని వెల్లడించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు సాగునీటి ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో రద్దు చేయాలని అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం అంటు వ్యాధుల నివారణ కోసం ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు