ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. 52వ గ్రంథాలయ వార్షికోత్సవాలు నేటితో ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి అంశంపై అవగాహన పెంచుకొని ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని... తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'