హుజూర్నగర్ ఉపఎన్నికల ఏర్పాట్లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఎం-3 యంత్రాలన్నీ జిల్లా కేంద్రానికి వచ్చాయి. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉంటారని భావించిన ఈసీ అందుకు తగ్గట్లుగా సన్నద్ధమైంది. ఇక్కడ 5,6 బ్యాలెట్ యూనిట్లు అవసరమని అంచనా వేసింది. 2వేల పైచిలుకు యూనిట్లను సిద్ధంగా ఉంచారు. వీటికి నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సీ బుధవారానికి పూర్తయినట్లు కలెక్టర్ అమోయ్‌కుమార్ తెలిపారు. మాక్ పోలింగ్ కూడా ముగిసిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" గీతానికి ప్రధాని అభినందనలు