సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో అర్ధరాత్రి ఇల్లు దగ్ధమైంది. రాత్రి 2:30గంటల సమయంలో గ్యాస్ లీకవ్వడం వల్ల కాలి బూడిదైంది. ఇంటి యజమాని వేముల రమేశ్ కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా ఈ ఘటన జరిగింది.
స్థానికులు మంటలు ఆర్పే లోపే ఇల్లు కాలి బూడిదైనట్లు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
ఇదీ చదవండి: పెళ్లి ఆగిందనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య