మనకెందుకులే అనుకోకుండా వైద్య సిబ్బంది తమ బాధ్యతను నిర్వర్తించారు. ప్రమాదమని తెలిసినా వాగు దాటి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సూర్యాపేట జిల్లా చిన్ననేమిల ఉప కేంద్రం పరిధిలోని పిజ్జా నాయక్ తండాకు వెళ్లాలంటే వాగు దాటాలి.
పిల్లలకు చుక్కల మందు అందించాలన్న లక్ష్యంతో వైద్యాధికారి త్రివేణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పాలేరు వాగును తాడు, ట్యూబ్ సాయంతో దాటారు. తండాలోకి చేరుకున్నారు. చిన్నారులకు చుక్కల మందు వేశారు. వాగు దాటి తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బందికి తండావాసులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.1293 కోట్లు