ఆర్టీసీ కార్మికులు పంతాన్ని వీడి విధులకు హాజరై ఉంటే మంచి భవిష్యత్ ఉండేదన్నారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కొందరి సొంత ప్రయోజనాల కోసం కార్మికుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం పెంచని విధంగా వేతనాలను పెంచి వారికి అండగా నిలిచామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..