"హాలియాలో సీఎం కేసీఆర్ సభ జరుగుతుంది. గుర్రంపోడు తండా నుంచి 500 మంది వెళ్లాలి. గుర్రంపోడు గ్రామసర్పంచ్ పార్వతి రామారావు తెలియపరుస్తున్నారు అందరికి.." ఈ విధంగా తాను తండాలో ప్రచారం చేస్తే... కొందరు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో అసత్యం ప్రచారం చేస్తున్నారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సభకు వెళ్లిన వారికి రూ.500 చొప్పున చెల్లిస్తామని ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇదీ చూడండి: సీఎం నాగార్జున సాగర్ పర్యటన షెడ్యూల్