రైతుల కోసం అహర్నిశలు కష్టపడుతూ దేశంలోనే సీఎం కేసీఆర్ మొదటి శ్రేణిలో నిలుస్తున్నారని సూర్యాపేట జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎస్ఏ.రజాక్ అన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రతి క్లస్టర్‌కు 22 లక్షల రూపాయలతో మండలంలోని మూడు క్లస్టర్లలోలో రైతు వేదిక నిర్మాణ పనులు చేస్తున్నట్లు తెలిపారు.
రైతువేదికలను రైతులు సద్వినియోగం చేసుకుంటే రానున్న రోజుల్లో ఏ రైతు అప్పుల బారిన పడరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రజాక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర, పీఏసీఎస్ ఛైర్మన్ కనకటి వెంకన్న, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్ రెడ్డి, సర్పంచ్ దామర్ల వెంకన్న, ఎంపీటీసీ సభ్యులు శిరంశెట్టి వెంకన్న, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో సరోజ, ఏఈ నవకాంత్, ఏవో దివ్య , తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన