ETV Bharat / state

ప్రభుత్వం చెప్పిన పంట వేస్తామని రైతుల ప్రతిజ్ఞ - సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం సూచించిన పంటలే పండిస్తామని సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో రైతులు ప్రతిజ్ఞ చేశారు. రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడే ఆలోచలను చేస్తున్న ప్రభుత్వ సూచనలు పాటిస్తామని మండల రైతులు తెలిపారు.

Formers Pledge For Follows The Government Crop Plan In Suryapet
ప్రభుత్వం చెప్పిన పంట వేస్తామని రైతుల ప్రతిజ్ఞ
author img

By

Published : May 25, 2020, 8:39 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పసునూరు గ్రామంలో రైతులు ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు ప్రభుత్వం సూచించిన పంటలే పండిస్తామని రైతులు అన్నారు. వరి పంట కాకుండా.. ఈ సారి ప్రభుత్వాధికారుల సూచన మేరకు పత్తి పంట సాగు చేస్తామని రైతులు తెలిపారు. వరిలో సన్న రకాలైన తెలంగాణ సోనా, బీపీటీ రకాలను సాగు చేస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. గ్రామ కో ఆర్డినేటర్​ లింగయ్య, రైతులు మామిడి లక్ష్మయ్య, శేఖర్​, వెంకన్న, సాయిలు తదితరుల ఆధ్వర్యంలో రైతులు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.