ETV Bharat / state

నడిరోడ్డుపై కారు దగ్ధం....ప్రయాణికులు సురక్షితం.. - FIRE ACCIDENT TO CAR

రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూండగానే కాలి బూడిదైపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.

FIRE ACCIDENT IN RUNNING CAR AT RAGAVAPURAM

author img

By

Published : Mar 12, 2020, 3:05 PM IST

సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. భద్రాచలం నుంచి సూర్యాపేటకు ఇద్దరు వ్యక్తులు కారులో వస్తుండగా రాఘవపురం స్టేజీ వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది.

ప్రయాణిస్తున్న కారు దగ్ధం... ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు

ప్రమాదాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు అప్రమత్తమై కిందికి దిగారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా... ఫలితం లేకుండాపోయింది. ఈ ఘటనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్​ని పునరుద్ధరించారు.

ఇదీ చూడండి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.