తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను రోడ్డుపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెం, గుడిమల్కాపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి తరఫున ప్రచారంలో కొండా సురేఖ పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గ ముఖచిత్రమే మారుస్తామని మాయమాటలు చెప్తున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. పద్మావతికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."