సూర్యాపేట జిల్లా కోదాడ, మునగాల మండలాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. మునగాలలో రూ. 3.82 కోట్లతో నిర్మిస్తున్న 72 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం కోదాడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు.
లాక్‌డౌన్‌తో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయని, నిబంధనలు సడలించిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్ఎంసీ మేయర్ కుటుంబం