ETV Bharat / state

RESIGN DEMAND: కోదాడ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఆందోళన - తెలంగాణ వార్తలు

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి భాజపా నాయకులు మద్దతు తెలిపారు. నియోజకవర్గంలో దళితబంధు రావాలంటే..ఎమ్మెల్యే తప్పుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోగా.. పోలీసులకు-ఆందోళనకారులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

RESIGN DEMAND: కోదాడ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని దళితసంఘాల ఆందోళన

author img

By

Published : Aug 1, 2021, 5:36 PM IST

RESIGN DEMAND: కోదాడ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని దళితసంఘాల ఆందోళన

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి భాజపా రాష్ట్ర నాయకుడు వేలంగి రాజు మద్దతు తెలిపారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టగా.. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కోదాడ దళితులకు దళితబంధు రావాలంటే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలని దళితులు డిమాండ్ చేశారు.

రాజీనామా ద్వారా ఉపఎన్నిక వస్తే ఈ ప్రాంత దళితులకు దళితబంధు వస్తుందని అన్నారు. దళితుల అభివృద్ధిపై కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని దళిత సంఘాల నాయకులు అన్నారు. కేసీఆర్​కు హుజూరాబాద్ లో ఓటమి భయంతో మరో మారు దళితులను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర నాయకుడు ఓర్సు వేలంగి రాజు ఆరోపించారు. దళిత సంఘాలు ఆందోళన విరమించకపోవడంతో భాజపా నాయకులను, దళిత సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఎమ్మెల్యే రాజీనామా చేయాలి..

కోదాడ నియోజకవర్గంలో కూడా వేల సంఖ్యలో దళితులు ఉన్నారు. మరీ ఈ నియోజకవర్గంలోని వారికి కూడా దళిత బంధు కావాలి. ఇక్కడ కూడా ఉపఎన్నిక వస్తే ఈ ప్రాంతంలోని దళితులకు దళితబంధు వస్తది. ఉపఎన్నిక రావాలంటే.. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారికి దండం పెట్టి చెబుతున్నా... అయ్యా.. కోదాడ దళిత సోదరులను మనస్సులో పెట్టుకుని రాజీనామా చేస్తే కనువిప్పు వస్తది. -వేలంగి రాజు, భాజపా నాయకులు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.