ETV Bharat / state

హుజూర్​నగర్​లో మున్సిపల్ సమావేశం

author img

By

Published : Jun 11, 2020, 10:06 PM IST

హుజూర్​నగర్ మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్ హాల్​లో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలకు ఆమోదం లభించినట్లు మున్సిపల్ ఛైర్మన్ అర్చన తెలిపారు.

Huzur nagar
Meeting

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మున్సిపాలిటీలోని జీవీపీ ఫంక్షన్ హాల్లో గురువారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇందులో 105 తీర్మానాలకు గానూ 102 తీర్మానాలకు ఆమోదం లభించినట్లు మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన తెలిపారు.

రూ. 6 కోట్లతో మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులను రూ. 3 కోట్ల 20 లక్షలు మినరల్ ఫండ్, కోటి 28 లక్షలు ఎస్సీ నిధుల నుంచి, రూ.50 లక్షలు జనరల్ ఫండ్ మరియు ఇతర నిధులతో చేపట్టనున్నామని వివరించారు. ఈ నిధులతో మున్సిపాలిటీలోని రోడ్లు, డ్రైనేజీలు, హరితహారం, పబ్లిక్ టాయిలెట్స్, స్ట్రీట్ వెండర్స్ స్థలాన్ని కేటాయించడానికి వినియోగించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వైస్ ఛైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

చూడండి: కరోనా కట్టడిలో సర్కారు విఫలం: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.