సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మంగలితండాలో పోలీసులు కట్టడి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టడానికే కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించామని డీఎస్పీ రఘు వెల్లడించారు. తండాలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే... వెంనటే పోలీసులు సమాచారమివ్వాలని గ్రామస్థులకు సూచించారు.
ఇవీ చూడండి: కేసీఆర్ వెంట మంత్రి ఈటల కుటుంబం...